టీసేవ ద్వారా రైల్వే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్థికసాయం

ABN , First Publish Date - 2021-03-27T02:55:53+05:30 IST

పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కల్నల్ నాగేష్ చంద్ర గుప్తా ముందుకొచ్చారు. భార్య మాధురి జ్ఞాపకార్థం విద్యార్థులకు ఫీజు కట్టి సహాయం..

టీసేవ ద్వారా రైల్వే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్థికసాయం

హైదరాబాద్: పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కల్నల్ నాగేష్ చంద్ర గుప్తా ముందుకొచ్చారు. భార్య మాధురి జ్ఞాపకార్థం విద్యార్థులకు ఫీజు కట్టి సహాయం చేయనున్నారు. ట్రై సర్వీసెస్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్(టీసేవ), మాధురీ సేవా ఫండ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కళాశాల లో చదవుతున్న11 మంది పేద విద్యార్థులకు ఫీజు నిమిత్తం రూ.1,26,050 కు డీడీని రైల్వే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ భాష్యంకు అందజేశారు. కమడోర్ సుధీర్ పరకాల విద్యార్థులను ఉద్దేశించి, డిఫెన్స్ సర్వీస్ కు ఉత్సాహం చూపించి ముందడుగు వేసి దేశానికి ఉపయోగపడాలని ప్రసంగిచారు.  కల్నల్ డాక్టర్ సేఠి, కల్నల్ పార్వతీశం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



Updated Date - 2021-03-27T02:55:53+05:30 IST