అదో విచిత్రమైన కాల‌నీ... నేల మాళిగ‌ల్లాంటి ఇళ్లు..... నిచ్చెన సాయంతో ఎక్కాల్సిన రోడ్లు!

ABN , First Publish Date - 2021-06-23T11:16:17+05:30 IST

రహదారికి కిందుగా ఉండే ఇళ్లను...

అదో విచిత్రమైన కాల‌నీ...  నేల మాళిగ‌ల్లాంటి ఇళ్లు..... నిచ్చెన సాయంతో ఎక్కాల్సిన రోడ్లు!

న్యూఢిల్లీ: రహదారికి కిందుగా ఉండే ఇళ్లను మీరు ఎప్పుడైనా చూశారా? అయితే అలాంటి కాలనీని ఇప్పుడు చూద్దాం. ఇక్క‌డి ఇళ్ల‌లోకి వెళుతున్న‌ప్పుడు ఏదో నేలమాళిగలోకి ప్రవేశిస్తున్నామ‌నే భావ‌న క‌లుగుతుంది. అలాంటి విచిత్ర‌మైన కాల‌నీ ఢిల్లీలో బురారి ప‌రిధిలోగ‌ల‌ తోమర్‌లో ఉంది. తోమర్ కాలనీలో, రహదారి పైకి ఉంటుంది. ఇళ్లు కింద‌కు ఉంటాయి. వీళ్లంతా ఇంటి నుంచి బయటకు రావ‌డానికి అంటే ప్రధాన రహదారికి వ‌చ్చేందుకు నిచ్చెన సహాయం తీసుకుంటారు. లేదా మెయిన్ డోరుకు పైన ఏర్పాటు చేసుకున్న మెట్లు ద్వారా రోడ్డు మీద‌కు వ‌స్తారు. ఇప్పుడు ఈ కాలనీ ప్రజలు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. 


బురారీకి చెందిన వారు ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో గత మూడు, నాలుగు ఏళ్లుగా రోడ్డు నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఈ  కొత్త రోడ్లు ఇక్క‌డి ఇళ్లకు మీదుగా ఉంటున్నాయి. దీంతో కాల‌నీ వారు ప‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రోడ్ల ప‌క్క‌గా ఉన్న కాలువల్లోని నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తున్న‌ద‌ని కాలనీవాసులు వాపోతున్నారు. వర్షాకాలంలో ఇక్క‌డి ఇళ్ల‌న్నీ చెరువులుగా  మారుతున్నాయి. ఇది స్థానికుల‌కు చాలా ఇబ్బందిక‌రంగా  మారింది. ఈ కాల‌నీ ఏర్పాటులో స‌రైన ప్ర‌ణాళిక లేని కార‌ణంగానే ఇన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. మ‌రి ఇవి ఎప్ప‌టికి తీరుతాయో ఢిల్లీ ప్ర‌భుత్వ‌మే తేల్చిచెప్పాలి. 

Updated Date - 2021-06-23T11:16:17+05:30 IST