Abn logo
Jun 3 2020 @ 17:58PM

రంగుల ఖర్చును వైసీపీ నేతల నుంచే రాబట్టాలి: చంద్రబాబు

హైదరాబాద్: రంగుల ఖర్చును వైసీపీ నేతల నుంచే రాబట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు చేస్తుందనేదానికి.. రంగుల ఉదంతమే నిదర్శనమని చెప్పారు. రాజ్యాంగ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కారం, అహంభావం, మూర్ఖత్వానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. తాము చేసిందే ఒప్పు అనేలా కోర్టుల్లో వాదనలు చేయడం.. తప్పుడు జీవోలు, వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం కన్నా.. మూర్ఖత్వం మరొకటి లేదని చంద్రబాబు తప్పుబట్టారు. ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం వంద తప్పులు చేసిందని దుయ్యబట్టారు. తీర్పు అమలు చేయలేదు కాబట్టే కోర్టు ధిక్కరణగా తీసుకుని, సీఎస్‌, సెక్రటరీ, కమిషనర్‌ హాజరు కావాలని ఆదేశించారని తెలిపారు. వైసీపీ తప్పులకు ముగ్గురు ఉన్నతాధికారులు కోర్టులో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఇంత జరిగినా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆక్షేపించారు. అందరిదీ ఒక దారైతే వైసీపీది మరో దారని ఎద్దేవాచేశారు. రంగులపై డబ్బులు, అడ్వొకేట్లకు ఫీజులు వృథా అని చంద్రబాబు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement