రంగుల పక్షి!

ABN , First Publish Date - 2021-02-20T05:55:19+05:30 IST

అక్బర్‌కు పక్షులంటే ఇష్టం. ఆ విషయం తెలుసుకున్న పక్షులు పట్టే వ్యక్తి ఒకరు సభకు విచ్చేశాడు. అతని దగ్గర రంగురంగుల పక్షి ఉంది. ‘‘మహారాజా! ఈ పక్షి నెమలిలా రకరకాల వర్ణాల్లో ఉండటమే కాదు, నెమలిలా నృత్యం చేస్తుంది. నెమలిలా ఎగురుతుంది’’

రంగుల పక్షి!

అక్బర్‌కు పక్షులంటే ఇష్టం. ఆ విషయం తెలుసుకున్న పక్షులు పట్టే వ్యక్తి ఒకరు సభకు విచ్చేశాడు. అతని దగ్గర రంగురంగుల పక్షి ఉంది. ‘‘మహారాజా! ఈ పక్షి నెమలిలా రకరకాల వర్ణాల్లో ఉండటమే కాదు, నెమలిలా నృత్యం చేస్తుంది. నెమలిలా ఎగురుతుంది’’ అని చెప్పాడు. దాంతో మహారాజు అతనికి 50 బంగారు నాణెలు ఇచ్చి పంపించాడు. ఆ బహుమతిని అందుకున్న అతడు వడివడిగా బయటపడ్డాడు. అతడు వెళుతుండగా బీర్బల్‌ సభలోకి అడుగుపెట్టాడు. ఆ పక్షి గురించి అక్బర్‌ బీర్బల్‌కు వివరించాడు. అప్పుడు బీర్బల్‌ ‘‘ఈ పక్షి నెమలిలా నృత్యం చేయదు. అంతేకాదు ఇది చాలా రోజులుగా స్నానం చేయలేదు’’ అన్నాడు. తరువాత కొన్ని నీళ్లు తెప్పించి ఆ పక్షిపై పోశాడు. దాన్ని చూసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. అది పావురం. దానికి రంగులు వేసి మోసం చేశాడని అందరూ తెలుసుకున్నారు. అప్పుడు మహారాజు ‘‘బీర్బల్‌ నువ్వు ఎలా గుర్తుపట్టావు?’’ అని అడిగాడు. అప్పుడు బీర్బల్‌ ‘‘నేను సభలోకి వస్తుండగా ఆ పక్షిని తెచ్చి వ్యక్తి వడివడిగా వెళుతున్నాడు. అతడి గోళ్లకు రంగులు అంటి ఉండడం చూశాను’’ అని వివరించాడు. తరువాత మోసం చేసిన వ్యక్తికి తగిన శిక్ష విధించాడు అక్బర్‌. అంతేకాదు... ఆ బహుమతిని బీర్బల్‌కు ఇచ్చాడు.

Read more