కలర్‌ఫుల్‌ హోలీ

ABN , First Publish Date - 2022-03-19T07:30:06+05:30 IST

జిల్లాలో శుక్రవారం వాడవాడలా హోలీ వేడుకలు చిన్నాపెద్ద తేడా లే కుండా ఉత్సాహంగా జరుపుకున్నారు.

కలర్‌ఫుల్‌ హోలీ
భైంసాలోని సాయినగర్‌ కాలనీలో హోలీ వేడుకల్లో పాల్గొన్న మహిళలు

వాడవాడలో హోలీ వేడుకలు

సంబరాల్లో మునిగి తేలిన జనం

వేడుకల్లో పాల్గొన్న జిల్లా ప్రముఖులు

నిర్మల్‌ కల్చరల్‌/భైంసా/ఖానాపూర్‌ రూరల్‌/ఖానాపూర్‌/దస్తూరాబాద్‌,  నర్సాపూర్‌ జి/ పెంబి/ కుంటాల/ కుభీర్‌/సారంగపూర్‌, మార్చి 18 : జిల్లాలో శుక్రవారం వాడవాడలా హోలీ వేడుకలు చిన్నాపెద్ద తేడా లే కుండా ఉత్సాహంగా జరుపుకున్నారు. గురువారం రాత్రిపెద్ద ఎత్తున ప్రధానకూడళ్ల వద్ద కామదహనం నిర్వ హించారు. కామదహనంలో పాల్గొన్న ప్రజలు ఉదయం నుండి రంగులు చల్లుకుంటూ మిత్రులను కలుసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా హోలీ పండగకు దూరంగా ఉన్న ప్రజలు ఆసక్తిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు, యువతీ యువకులతో పాటు మహిళలు, ప్రభుత్వ ఉద్యో గులు, రాజకీయ ప్రముఖులు హోలీ సందర్భంగా రంగులు చల్లుకున్నారు. టీఎన్జీవో సంఘ నాయకులు ప్రభాకర్‌, రవికుమార్‌, తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొనగా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ ప్రవీణ్‌ కమార్‌తో పాటు ఇతర పోలీస్‌ అధికారులు సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని వేడుకలు నిర్వహించుకున్నారు. ఎస్పీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఎస్పీలు ఏ. రామ్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, డీఎస్పీలు ఉపేందర్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. మార్నింగ్‌ వాక్‌ అసోసియేషన్‌ సభ్యులు హోలీ వేడుకలు జరుపుకోగా భాగ్యనగర్‌ కాలనీ, గాంధీచౌక్‌, బుధవార్‌పేట్‌, తదితర ప్రధాన ప్రాంతాల్లో నిర్వహించిన హోలీ సంబరాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు రావుల రాంనాథ్‌, అయ్యన్నగారి రాజేందర్‌, తోట సత్యనారాయణ, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డిలను కలిసి రంగులు పూసి సంబరాలు జరుపుకున్నారు. ఎస్పీ క్యాంపు కార్యా లయంలో సీఐలు రమేష్‌, కుమారస్వామి, శ్రీనివాస్‌, వెంకటేష్‌ తది తరులు ఎస్పీని కలిసి పలువురు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 

భైంసా డివిజన్‌వాసులు  హోలీ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా కాలనీల మహిళలు కాలనీ పరిధిలో గుంపుగుంపులుగా పర్యటనలు చేస్తూ రంగులు పూసుకుంటూ పర్వదినాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు భైంసా మండలంలోని దేగాం గ్రామానికి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలివెళ్లి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి రంగులు పూశారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు డీసీసీ అధ్యక్షులు రాంరావ్‌ పటేల్‌కు రంగులు పూసి సాముహిక నృ త్యాలు చేశారు. బీజేపీ శ్రేణులు పోలీసుస్టేషన్‌లో హోలీ వేడుకలను చేపట్టి ఏఏస్పీ కిరణ్‌ ఖారే, సీఐ ప్రవీణ్‌ కుమార్‌లకు రంగులు పూసారు. 

ఖానాపూర్‌ మండలంలో శుక్రవారం హోలీ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని గ్రామాల్లో సంబురాలు చేసుకు న్నారు. సహజసిద్దమైన రంగులు చల్లుకున్నారు. రాజూరలో సర్పంచ్‌ చిన్నం లావణ్య రవీందర్‌ ఆద్వర్యంలో మహిళలు కలిసి రంగులు చల్లు కున్నారు.  ఖానాపూర్‌లో టీజీవో జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యామ్‌నాయక్‌ ప్రారంభించారు.  వేర్వేరు కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, మాజీ జడ్‌పీటీసీ రాథోడ్‌రామునాయక్‌, సీఐ అజయ్‌బాబు, ఎస్‌ ఐ రజినీకాంత్‌, రైతుబంధుసమితి జిల్లా డైరెక్టర్‌ కొక్కుల ప్రదీప్‌, నాయకులు ఓంసాయి నారాయణ, కుర్మ శ్రీనివాస్‌ తదితరులున్నారు. 

దస్తూరాబాద్‌ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ కార్య కర్తలు, నాయకులు నిర్వహించిన హోలీ వేడుకల్లో మండల ఎంపీపీ సింగరి కిషన్‌ పాల్గొన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆ యా గ్రామాల్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అన్ని గ్రా మాల్లో ఉదయమే చిన్నారులు రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ సంబరాల్లో మునిగితేలారు. గ్రామాల్లో కామదహనం నిర్వహించి హోలీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో ఉదయమే చిన్నారులు హోలీ సంబరాల్లో మునిగిపోయారు. చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులు చల్లు కుంటూ జరుపుకున్నారు. మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో హోలీ సంబరాలను జరుపుకున్నారు. యువకులు, మహిళలు తగు జాగ్రత్తలు పాటిస్తూ హోలీ సంబరాలు జరుపుకోవాలని దస్తూరా బాద్‌ ఎస్సై జ్యోతిమణి సూచించారు. 

Updated Date - 2022-03-19T07:30:06+05:30 IST