దగ్గరుండి.. అంత్యక్రియలు పూర్తిచేసి

ABN , First Publish Date - 2021-05-08T05:05:48+05:30 IST

ప్రస్తుతం కరోనా పేరు చెబితేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని తెలిస్తే వారి ఇంటి దరిదాబుల్లోకి ఎవరూ చేరడం లేదు. ఇక కరోనాతో మృతి చెందిన వారి పరిస్థితి చెప్పనవసరం లేదు

దగ్గరుండి.. అంత్యక్రియలు పూర్తిచేసి
మృతదేహాం తరలింపులో సహాయపడుతున్న వలంటీర్లు

కరోనాతో మృతి చెందిన వృద్ధురాలికి దహనసంస్కారాలు

 వలంటీర్ల సేవాతత్పరత

ఆమదాలవలస: ప్రస్తుతం కరోనా పేరు చెబితేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉన్నాయని తెలిస్తే వారి ఇంటి దరిదాబుల్లోకి ఎవరూ చేరడం లేదు. ఇక కరోనాతో మృతి చెందిన వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆ మృతదేహాన్ని పట్టుకోవడం దేవుడెరుగు కనీసం ఆ శవాన్ని కిలో మీటర్ల దూరం నుంచి చూసేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమదాలవలసలోని లక్ష్మీనగర్‌ వలంటీర్లు తమ సేవాతత్పరతను చాటుకున్నారు. ఆ వీధికి చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో శుక్రవారం మృతిచెందింది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం  అంత్యక్రియల నిర్వహణకు  కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. దీంతో  వలంటీరు సాయికుమార్‌, తదితరులు వృద్ధురాలి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి దగ్గరుండి దహన సంస్కారాలను పూర్తి చేశారు.


 

 



Updated Date - 2021-05-08T05:05:48+05:30 IST