Advertisement
Advertisement
Abn logo
Advertisement

పుట్టినరోజు వేడుకలకు వచ్చి మృత్యువాత

కృష్ణా: తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకులకు వచ్చిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. పుట్టినరోజు వేడుకలకు వచ్చిన నాగేశ్వరరావు లనే వ్యక్తి పొట్టిపాడు రైలు పట్టాలపై మృతి చెందాడు. ఆత్కూరు గ్రామంలో స్నేహితుడి  జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వంశీ, నాగేశ్వరావు అనే స్నేహితులు విజయవాడ నుంచి వచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రైలు పట్టాలపైకి వంశీ, నాగేశ్వరావు వెళ్ళారు. అయితే ఒక్కసారిగా రైలు రావడంతో వంశీ తప్పుకోవడంతో నాగేశ్వరావును రైలు ఢీకొంది. మద్యం మత్తులో ట్రైన్ వచ్చే విషయాన్ని తాత సాయి నాగేశ్వరరావు గమనించలేదు. ట్రైన్ ఢీకొనడంతో నాగేశ్వరావు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తాత సాయి నాగేశ్వరావు( 21)ను విజయవాడలోని కృష్ణ లంకకు చెందిన వ్యక్తిగా ఏలూరు రైల్వే పోలీసులు గుర్తించారు. 

Advertisement
Advertisement