Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం వ్యాపారంలోకి హాస్య నటుడు రఘు

లక్కీ డ్రాలో నల్లగొండలో రెండు వైన్స్‌ షాపులు సొంతం

నల్లగొండ : పై ఫొటో, ఏదో సినిమా షూటింగ్‌ తాలూకుదేమో అనుకునేరు. ఈ చిత్రంలో కనిపిస్తున్న హాస్య నటుడు రఘు, వాస్తవంగానే మద్యం విక్రయిస్తున్నారు! ఆయన మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మద్యం దుకాణాల కేటాయింపునకు ఇటీవల నిర్వహించిన లక్కీడ్రాలో ఆయన రెండు వైన్‌ షాపులను సొంతం చేసుకున్నారు. నల్లగొండ పట్టణ శివారు చర్లపల్లి వద్ద మర్రిగూడ బైపా్‌సలోని తనకు దక్కిన షాప్‌లో రఘు.. స్వయంగా మద్యం సీసాలను సర్దారు. పూజలు చేశారు. కౌంటర్‌ వద్ద ఉండి మద్యాన్ని విక్రయించారు. సినిమా, టీవీ ప్రేక్షకులకు సుపరిచితులైన రఘు మద్యం దుకాణం కౌంటర్‌లో నిల్చుని మద్యం విక్రయిస్తుండటంతో మద్యం ప్రియులు, అటుగా వెళ్లేవారు ఆసక్తిగా గమనించారు. ఫొటోలు తీశారు. అవి నెట్‌లో వైరల్‌ అయ్యాయి.  

Advertisement
Advertisement