పాత పింఛను సాధన..మా తపన సీపీఎస్టీఈఏటీఎస్

ABN , First Publish Date - 2021-12-03T23:50:59+05:30 IST

పాత పింఛను పథకం సాధన కోసం మరణమా..శరణమా ఆన్న రీతిలో పోరు మరింత ఉదృతం చేస్తామని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్

పాత పింఛను సాధన..మా తపన సీపీఎస్టీఈఏటీఎస్

హైదరాబాద్: పాత పింఛను పథకం సాధన కోసం మరణమా..శరణమా ఆన్న రీతిలో పోరు మరింత ఉదృతం చేస్తామని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ అన్నారు. శుక్రవారం నాడు యావత్ భారత ఎన్ పీ ఎస్ (న్యూ పెన్షన్ స్కీమ్) శ్రేణులు,"నా..హక్కు పాత పింఛను పథకం" ఆన్న నినాదం దేశ వ్యాప్తంగా ట్విట్టర్ లో వైరల్ ఐయ్యింది. దేశ వ్యాప్త భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ శ్రేణులు , మొన్న లక్నో లో ప్రత్యక్ష కార్యాచరణ కు ఉపక్రమించి ర్యాలీ నిర్వహించారు.అలాగే శుక్రవారం "మై రైట్ ఓ పీ ఎస్" ఆన్న హ్యష్ ట్యాగ్ ను ఉపయోగించి , పాత పింఛను పథకం సాధనకు గళం వినిపించారు.


డెబ్భై లక్షల పై చిలుకు ఉపాధ్యాయ ఉద్యోగ శ్రేణులు ట్విట్టర్, తదితర సామాజిక మాధ్యమాలే ఆయుధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పురుద్దరణ కు మరణమా..శరణమా ఆన్న రీతిలో తమ ఘోష తాలుకు తీవ్రత ఢిల్లీ కి తాకేలా చేశారు. ఆర్థిక మంత్రి , ప్రధాన మంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఎంపీలు,ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితరులకు ట్యాగ్ చేసి తమ వాణి వినిపించారు.పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం దేశం వ్యాప్త సంఘాలు, ముఖ్యంగా పాత పింఛను పథకం సాధన కోసం ఉద్యమ పథం లో ముందున్న సంఘాలు గత రెండు రోజులుగా ఈ రోజు జరిగిన ట్విట్టర్ ప్రచారం లో పాల్గొనాలని పిలుపునిచ్చాయి.

Updated Date - 2021-12-03T23:50:59+05:30 IST