Abn logo
Oct 17 2021 @ 23:38PM

క్షీరా రామంలో సమాచార కమిషనర్‌ పూజలు

చిన్నారెడ్డి దంపతులకు స్వామి చిత్రపటాన్ని అందిస్తున్న ఆలయ చైర్మన్‌, ఈవో

పాలకొల్లు అర్బన్‌, అక్టోబరు 17:పంచారామ క్షేత్రం క్షీరా రామ లింగేశ్వర స్వామిని ఆదివారం పలువురు అధికారులు సందర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా రాష్ట్ర సమాచార కమిషనర్‌  కె.చిన్నారెడ్డి దంపతులు, అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా దంపతులు, అడిషినల్‌ ఎస్పీ (ఏలూరు) ఏవీ సుబ్బరాజు దంపతులు స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కల్యాణ వేదికపై వేద పండితుల వేదాశీర్వచనాలు అనంతరం స్వామి శేష వస్ర్తాలు, చిత్రపటాలను ఈవో యాళ్ళ సూర్యనారాయణ, పాలక మండలి చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు అందజేశారు. ట్రస్టు బోర్డు సభ్యులు ఆర్‌.నరసింహారావు, జ్యోతి బాలాజీ, ఎన్‌.నెహ్రూ పాల్గొన్నారు.