8న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలల ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-20T05:13:44+05:30 IST

వచ్చే నెల 8న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలను ప్రారంభించనున్నట్లు పశు సంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు అమరేంద్ర స్పష్టం చేశారు.

8న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలల ప్రారంభం
ప్రయోగశాలను పరిశీలిస్తున్న అమరేంద్ర తదితరులు

శ్రీకాళహస్తి, జూన్‌ 19: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 8న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలను ప్రారంభించనున్నట్లు పశు సంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్‌ అమరేంద్ర కుమార్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన శ్రీకాళహస్తి పట్టణం మార్కెట్‌ యార్డు ఆవరణలో నిర్మిస్తున్న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమరేంద్ర మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ ల్యాబ్‌ సిబ్బంది భూసార పరీక్షలు, పంట తెగుళ్లు, పశువులకు సోకే వ్యాధులపై పరిశోధన చేస్తారని చెప్పారు. వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా ఈ ప్రయోగశాలను నిర్వహిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీడీలు చంద్రశేఖర్‌గౌడ్‌, పద్మావతి, భవానీశంకర్‌, ఏడీ శ్రీకాంత్‌బాబు, ఏవో సుహర్‌లత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:13:44+05:30 IST