కామర్స్‌ విద్యార్థుల కోసం కొత్త యాప్‌

ABN , First Publish Date - 2021-12-17T15:04:34+05:30 IST

రాష్ట్రంలో కామర్స్‌ కోర్సులు చదువుతున్న ప్లస్‌-1, ప్లస్‌-2 విద్యార్థుల కోసం ఆక్సెస్‌ లెర్న్‌ పేరుతో రూపొందించిన కొత్త యాప్‌ను కేఈడబ్ల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వాహకుడు సీ గోకుల్‌రాజ్‌

కామర్స్‌ విద్యార్థుల కోసం కొత్త యాప్‌

చెన్నై: రాష్ట్రంలో కామర్స్‌ కోర్సులు చదువుతున్న ప్లస్‌-1, ప్లస్‌-2 విద్యార్థుల కోసం ఆక్సెస్‌  లెర్న్‌ పేరుతో రూపొందించిన కొత్త యాప్‌ను  కేఈడబ్ల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వాహకుడు సీ గోకుల్‌రాజ్‌ ఆవిష్కరించారు. పెరంబూరులోని ఎస్కేఎన్‌ఎస్‌ పీఎంసీ వివేకానంద విద్యాలయ జూనియర్‌ కాలేజీలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఈ యాప్‌ను విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ యాప్‌ను www.axuslearn.com అనే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవవచ్చునని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుజాత, జాయింట్‌ సెక్రటరీ శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-17T15:04:34+05:30 IST