కమిషన్‌ భగీరథ..!

ABN , First Publish Date - 2020-05-27T09:59:52+05:30 IST

ఇంటింటికీ తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ పథకం చేవెళ్ల డివిజన్‌లో అస్తవ్యస్తంగా

కమిషన్‌ భగీరథ..!

ట్యాంకు నిర్మాణ పనుల్లో కొరవడిన నాణ్యత

గుండాలలో ప్రారంభం కాకముందే లీకేజీ


 చేవెళ్ల : ఇంటింటికీ తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ పథకం చేవెళ్ల డివిజన్‌లో అస్తవ్యస్తంగా మారింది. పనుల్లో నాణ్యత కొరవడింది. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడటంతో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా భగీరథ పనులు చేస్తున్నాడు. చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో నిర్మించిన 60వేల లీటర్ల ఓహెచ్‌ఎ్‌సఆర్‌ ట్యాంకు నిర్మాణంలో నాణ్యత కొరవడింది. వాటర్‌ ట్యాంకు ప్రారంభించకుండానే లీకవుతోంది. దీంతో ట్యాంకులోకి నీరు వదలడమే మానేశారు. ప్రస్తుతం గ్రామంలోని పాత ట్యాంకులో నీరు నింపి గ్రామంలో సరఫరా చేస్తున్నారు. కొత్తగా భగీరథ పథకం ద్వారా నీటి ట్యాంకును ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.


ట్యాంకును నిర్మించిన కాంట్రాక్టర్‌ పత్తాలేకుండా పోయాడు. అధికారులు పర్సంటేజీలు పుచ్చుకుని బిల్లులు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్యాంకుకు రంగులు వేసేందుకు ఏర్పాటు చేసిన కర్రలు పైనే వేలాడుతున్నాయి. గట్టిగా గాలి వస్తే ఎగిరిపడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ట్యాంకుకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. అదేవిధంగా నాసిరకంగా ట్యాంకు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-05-27T09:59:52+05:30 IST