ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక రిజిష్టర్లు

ABN , First Publish Date - 2020-12-04T05:55:29+05:30 IST

ఘన వ్యర్థాల నిర్వహణకు వలంటీర్లకు ప్రత్యేక రిజిష్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు.

ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక రిజిష్టర్లు
రిజిష్టర్లను ఆవిష్కరిస్తున్న కమిషనర్‌ అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 3: ఘన వ్యర్థాల నిర్వహణకు వలంటీర్లకు ప్రత్యేక రిజిష్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ఆమె రిజిష్టర్లును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వలంటీర్లు ప్రతిరోజు తడిపొడి చెత్త విభజనకు సంబంధించిన వివరాలు రిజిష్టరులో నమోదు చేయాలన్నారు.  నోడల్‌ అధికారులు, ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు సదరు రిజిష్టర్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. 

మినీ ట్రక్కు వాహన దరఖాస్తుల పరిశీలన


రేషన్‌ సరుకులు సరఫరాకు ఏర్పాటు చేయనున్న మినీ ట్రక్కు వాహన దరఖాస్తులను గురువారం నగర కమిషనర్‌ చల్లా అనురాధ స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశీలించారు. కార్యక్రమంలో డీసీలు డీ శ్రీనివాసరావు, బీ శ్రీనివాసరావు, టీ వెంకట కృష్ణయ్య, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయసారఽథి, ప్రభుదాసు, వహిదా, వసంతలక్ష్మి, ఉపాసెల్‌ సూపరింటెండెంట్‌ శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-04T05:55:29+05:30 IST