పెద్దఅంబర్‌పేట్ కమిషనర్ Suspension
ABN , First Publish Date - 2022-01-22T15:34:32+05:30 IST
పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
హైదరాబాద్ / అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్‌ను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుంట్లూర్ గ్రామంలో కోర్టు పరిధిలో ఉన్న ప్లాట్లలో ఇంటి అనుమతుల మంజూ రు, పెద్దఅంబర్‌పేట్‌లో అనుమతులు ఒకచోట, నిర్మాణం మరోచోట జరుగుతున్న కారణాలతో వారం రోజుల క్రితం కమిషనర్‌కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు కమిషనర్ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.