‘చెత్త నుంచి సంపద’ కేంద్రాల బాధ్యత కమిటీలదే

ABN , First Publish Date - 2021-06-18T04:48:21+05:30 IST

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కమిటీలదేనని ఎంపీడీఓ నూ ర్జహాన, ఈఓపీఆర్‌డీ రమణారెడ్డి అన్నారు.

‘చెత్త నుంచి సంపద’ కేంద్రాల బాధ్యత కమిటీలదే
జగనన్న స్వచ్ఛ శంఖారావం అవగాహన సదస్సు దృశ్యం

పోరుమామిళ్ల, జూన 17: చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కమిటీలదేనని ఎంపీడీఓ నూ ర్జహాన, ఈఓపీఆర్‌డీ రమణారెడ్డి అన్నారు. గురువారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశమైన వారు జగనన్న స్వచ్ఛ శంఖారావం వంద రోజుల కా ర్యక్రమంపై అవగాహన నిర్వహించారు. సర్పంచుల ఆధ్వర్యంలో వార్డుమెంబర్లు, సచివాలయ సిబ్బంది ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు గ్రామ పెద్దలతో కలిపి కమి టీని ఏర్పాటు చేసి వందరోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో 17 పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T04:48:21+05:30 IST