Abn logo
Aug 5 2020 @ 05:13AM

80 కుటుంబాలకు నిత్యావసర సరుకులు

ఇచ్ఛాపురం, ఆగస్టు  4 : సిద్ధ్దబైరవి గ్యాస్‌ ఏజన్సీ, వీఎన్‌ఎం వాటర్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న 80మంది వర్కర్లకు  ప్రముఖ వ్యాపారవేత్త వీఎన్‌ఎం ఫౌండేషన్‌ చైర్మన్‌ వజ్రపు వెంకటేశ్‌, నిత్యావసర సరుకులతో పాటు ఆర్థికసాయం అందజేశారు. ఈమేరకు  మంగళవారం  వాటర్‌ ప్లాంట్‌ వద్ద ఒక్కో వర్కర్‌కు 50  కిలోల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో కార్మికులను  నాలుగు విడతలుగా ఆదుకున్నట్టు వివరించారు.


సరుబుజ్జిలి: నిరుపేదలకు శ్రీకాకుళానికి చెందిన అప్‌హోల్డ్‌ స్వచ్ఛంద సేవాసంస్థ  మంగళవారం నిత్యావసర సరుకులను అందజేసింది.  సంస్థ ప్రతినిధులు రవికుమార్‌, తిమోతిల ఆధ్వర్యంలో శ్రీరాంవలస, చిగురువలస, సుబ్బుపేట, పెద్దమాలపేటల్లోని  పేదలకు  సరుకులను పంపిణీ  చేశారు.   మండల కో-ఆప్సన్‌  సభ్యుడు ప్రత్తిపాటి ప్రసాదరావు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement