జూలైలో సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2022-03-22T00:12:08+05:30 IST

దేశంలోని 45 సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశానికి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఈ ఏడాది అడ్మిషన్లకు సంబంధించిన పరీక్ష వచ్చే జూలై మొదటివారంలో జరుగుతుందని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ సోమవారం వెల్లడించారు.

జూలైలో సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్ష

దేశంలోని 45 సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశానికి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. ఈ ఏడాది అడ్మిషన్లకు సంబంధించిన పరీక్ష వచ్చే జూలై మొదటివారంలో జరుగుతుందని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ సోమవారం వెల్లడించారు. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందని, పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని చెప్పారు. +2 లేదా ఇంటర్మీడియెట్ మార్కులకు ఎలాంటి వెయిటేజీ ఉండదని, ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్ ఉండదని, మెరిట్ లిస్ట్ ఆధారంగానే విద్యార్థుల్ని చేర్చుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-03-22T00:12:08+05:30 IST