Abn logo
Apr 19 2021 @ 18:25PM

ఏబీఎన్‌తోనే తెలంగాణ ప్రభుత్వం కదిలింది!

వరంగల్: కరోనా సమయంలో రోగులు పడుతున్న ఇబ్బందులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేస్తున్న కథనాలు ప్రజా ప్రతినిధులను, అధికారులను కదలిస్తున్నాయి. వరంగల్ ఎంజీఎంలో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. మంత్రి ఈటల రాజేందర్ సోమవారం వరంగల్ ఎంజీఎంకు వెళ్లారు. ఆస్పత్రిని పరిశీలించారు. రోగులు పడుతున్న ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహించొద్దని డాక్టర్లు, సిబ్బందికి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలతోనే తెలంగాణ ప్రభుత్వం కదిలిందని, బరాబర్ చెబుతున్నానని ఓ యువకుడు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement