సామాన్యులే సాయుధులై

ABN , First Publish Date - 2022-09-17T07:21:39+05:30 IST

బానిస బతుకుల విముక్తి కోసం రజాకార్ల అకృత్యాలకు విసిగి వేసారిన ప్రజలు నిజాంప్రభుత్వాన్ని రద్దుచేసేందుకు చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల చరిత్ర ఎంతో ఘనమైనది. ఎంతో మంది సాయుధ పోరాట యోధులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.

సామాన్యులే సాయుధులై

తిరగబడ్డ ఇందూరు గడ్డ

నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం

విమోచనోద్యమంలో మోర్తాడ్‌ పోరాట వీరులు

సాయుధ పోరాటంలో ఉమ్మడి జిల్లా ప్రముఖులు

నేడు తెలంగాణ విమోచన దినం

మోర్తాడ్‌, సెప్టెంబరు 16: బానిస బతుకుల విముక్తి కోసం రజాకార్ల అకృత్యాలకు విసిగి వేసారిన ప్రజలు నిజాంప్రభుత్వాన్ని రద్దుచేసేందుకు చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల చరిత్ర ఎంతో ఘనమైనది. ఎంతో మంది సాయుధ పోరాట యోధులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కలంతో దాశరథి కృష్ణామాచార్య నిజామాబాద్‌ ఖిల్లా జైలులో ఉద్యమ గళం విప్పారు. కత్తి పోటును సైతం లెక్క చేయకుండా జాగో ప్రజా..బాగో నిజాం..అన్న రాధాకృష్ణ మోదాని నిజామాబాద్‌ జిల్లా వాడే. కన్నవారిని..పుట్టిన ఊరిని వదిలి నిజాంను ఎదురించిన నర్సింహారెడ్డి, సర్దార్‌ ప్రేమ్‌సింగ్‌, పణిహారం రంగాచారి, రాజారెడ్డి, కుప్రియాల్‌ గోపాల్‌రెడ్డి, ఎర్రాపహాడ్‌కు చెందిన బొక్క గుండారెడ్డి వంటి ఎందరో ఉద్యమ వీరులు పోరాట స్ఫూర్తిని నింపి ఉమ్మడి జిల్లాకే గర్వకారణంగా మారారు. 

రజాకార్లకు ఎదురొడ్డిన మోర్తాడ్‌ వాసులు

తెలంగాణ విమోచనోద్యమంలో నిజాంకు వ్యతి రేకంగా పోరాడి జైలుశిక్ష అభినుభవించిన వారిలో అత్యధికులు మోర్తాడ్‌ ప్రాంత వాసులే కావడం గమనార్హం. మోర్తాడ్‌కు చెందిన సోషలిస్టు లింబాగిరి దూత గంగారాంలు రజాకార్లకు ఎదురొడ్డి పోరా డారు. ఇందులో భాగంగానే పెద్దఎత్తున యువ కులను సమీక్షించి కర్రసాము నేర్పించారు. ఈ ప్రాం తానికి చెందిన చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి కూడా విమో చన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమానికి ఆర్ధిక సహాయం చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. పాలెం గ్రామానికి చెందిన బద్దం చిన్నారెడ్డి విమోచన ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చారు. 1947లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర విమోచన దినోత్సవంలో పాల్గొని జైలు శిక్ష అను భవించారు. చిన్నారెడ్డి సేవలకు గుర్తింపుగాను 1973లో ప్రభుత్వం తమ్రపాత్రం ఇచ్చి ఆయనను సన్మానించింది. తెలంగాణ విమోచన ఉద్యమంలో రజాకార్లతో పోరాడిన వారిలో మోర్తాడ్‌ మండలానికి చెందిన రాజమల్లారెడ్డి (మోర్తాడ్‌), ముస్కు నారా యణ (సుంకెట్‌), బోగ చిన్నయ్య, అంబల్ల నర్సింలు, తిరుపతి రామనుజం, రిక్క గంగారాం, సడాక్‌ రాములు వీరందరు మోర్తాడ్‌ వాసులే, లోక గోపాల్‌ రెడ్డి(దర్మోరా), శెట్‌పల్లికి చెందిన నాయిబాలయ్య, రాజలింగం, బద్దం లింగారెడ్డి, నాయి సాయన్న ఉన్నారు. ఇలా ఉద్యమంలో పాల్గొని త్యాగాలు, బలి దానాలు చేసి చరిత్రపుటల్లో ఎక్కిన వారు కొందరైతే.. చరిత్రకు అందని వారు మరెందోరో ఉన్నారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో, మొన్నటి విమోచన ఉద్యమంలో.. 1969 ప్రత్యేక ఉద్యమంలో అగ్రభాగాన ఉండి ప్రాణత్యాగాలు చేసిన త్యాగాల గడ్డ మోర్తాడ్‌ చరిత్ర తనకు ఓ పేజీ కేటాయించుకుంది. 

 అంబల్ల నర్సింహులుపై జంగ్‌ మహబూబ్‌ దాడి

నిజాంపాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రోజుల్లో మోర్తాడ్‌కు చెందిన ఆర్యసమాజ్‌ నాయకు డు కొండాలక్ష్మణ్‌ బాపూజీ అనుచరుడు అంబల్ల నర్సింహులును హత్యచేయాలని జంగ్‌ మహబూబ్‌ కత్తితో దాడి చేశాడు. అంబల్ల నర్సింహులు ఆధ్వ ర్యంలో అనుచరులు నిజాంకు వ్యతిరేకంగా రజా కార్లను ఎదుర్కొనేందుకు కర్రసాములను యువ కులకు నేర్పించేవారు. దీనిని జీర్ణించుకోలేని రజాకార్లు అంబల్ల నర్సింహులును చంపాలని మహాదేవుని గుడి వద్ద కత్తితో దాడి చేశాడు. నర్సింహులు తప్పించుకునేందుకు చెయ్యి అడ్డు పెట్టగా చెయ్యిపై కత్తిని కుచ్చారు. ఈ విషయం తెలిసి నర్సింహులు అనుచరులు బోగ చిన్నయ్య, సడాక్‌ రాములు, కర్రలతో పరుగెత్తుకొని రావడంతో దాడి చేసిన జంగ్‌ మహబూబ్‌ పారి పోయాడు. అంబల్ల నర్సింహులు వెంటనే దేశ్‌మక్‌ గడ్డం గంగారెడ్డి తన వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జంగ్‌మ హబూబ్‌పై వేసిన కేసును స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ వాదించారు. ఇదే కేసును స్థానిక దేశ్‌ముఖ్‌ రాజేశ్వర్‌రెడ్డి కూడా వాదించారు. చివరకు అంబల్ల నర్సింహులుకు జైలుశిక్ష పడడంతో నిజామాబాద్‌ లోని ఖిల్లా జైలుకు తరలించారు. అదే సమయంలో 15నెలలు జైళ్లో ఉండి పోలీసు చర్య జరగడంతో ఆయన విడుదల అయ్యారు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మోర్తాడ్‌ వాసులదే.

 రాజారుక్మారెడ్డి మనోడే..

మోర్తాడ్‌ జమీందార్‌కు కొంత సైన్యం పిరంగులు, గోల్కొండ నవాబు తానీషా పాలనలో ఈవ జమీం దారులుగా కొనసాగారు. మోర్తాడ్‌ జమీందర్‌ కింద 50కిపైగా గ్రామాలు ఉండేవి. 1957లో నిజం కర్కశ పాలనలో ఉంటూ బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని కూలదొ య్యడానికి తొలిభారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన జమీందార్‌ గడ్డం రుక్మారెడ్డి మోర్తాడ్‌ వాస్తవ్యులే. 1830లో జన్మించిన రుక్మారెడ్డి ప్రథమ స్వాతంత్య్ర ఉద్యమనాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయికి సమకాలికులు. 30ఏళ్ల వయస్సులో కౌలాస రాజు దిలిప్‌సింగ్‌తో కలిసి మహారాష్ట్రలో ఎన్నో పోరాటాలు చేశారు. ఈ క్రమంలోనే బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా రుక్మారెడ్డితో పాటు పోరాడిన కౌలాసరాజు జమీందరీ తనం కోల్పోయారు. అప్పటి స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన రుక్మారెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ బ్రిటీష్‌ ప్రభుత్వం నిజాం నవాబును ఆదేశించింది. దీంతో రుక్మారెడ్డిని ఇనుప సంకేళ్లతో బంధించి అనేక రకాలుగా హింసించారు. అంతటితో ఆగకుండా రుక్మారెడ్డి తండ్రి జమీందర్‌ నర్సింహారెడ్డి ఆధీనంలో ఉన్న భూములు, గ్రామాలను నిజాం ప్రభుత్వం తగ్గించింది. ఎట్టకేలకు నిజాం ప్రభుత్వం రుక్మారెడ్డిని వృద్ధాప్యంలో విడుదల చేసింది. అప్పటి వరకు ఆయన జైల్లోనే దుర్బర జీవితాన్ని అనుభవించారు.

 కుప్రియాల్‌ గోపాల్‌రెడ్డిది గొప్ప చరిత్ర

సాయుధ పోరాటంలో కామారెడ్డి జిల్లాలో రజకార్ల అగడాలను ఎదిరించిన యోధుల్లో సదాశివనగర్‌ మండలం కుప్రియాల్‌ గోపాల్‌ రెడ్డి ఒకరు. మల్లన్న గుట్టపై రజాకార్లను ఎదిరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు తలమడ్లలో,మద్దికుంటలో గల రైస్‌ డిపోలపై దాడి చేసి బియ్యాన్ని కొల్ల గొట్టి గ్రామాల్లో పంచారు. అంతే కాకుండా భూ మి లేని నిరుపేదలకు భూమిని పంచి రజకార్ల గుం డెల్లో గుబులు పుట్టించారు. మారు వేశంలో గ్రామాల్లో రాత్రి వేళ్లలో సమావేశాలు నిర్వహించి రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పర్చారు. అలాగే తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌కు చెందిన బొక్క గుండారెడ్డి, బొక్క గంగారెడ్డి, బద్దం రాజిరెడ్డి, చాకలి ఎల్లయ్య, గొల్ల లచ్చయ్య, దండు రాజన్న, లింగంగౌడ్‌ తో పాటు ఎంతోమంది కామారెడ్డి డివిజన్‌లో కూడా రజాకార్ల చర్యలను వ్యతిరేకించి సాయుధపోరాటంలో పాల్గొన్నవారి చరిత్రలు ఉన్నాయి.

Updated Date - 2022-09-17T07:21:39+05:30 IST