Commonwealth Games 2022: కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం సాధించిపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు

ABN , First Publish Date - 2022-08-08T20:58:48+05:30 IST

కామన్వెల్త్ పోటీల్లో (Commonwealth Games 2022) తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) మెరిసింది. మహిళల సింగిల్స్‌లో..

Commonwealth Games 2022: కామన్వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం సాధించిపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు

బర్మింగ్‌‌హామ్: కామన్వెల్త్ పోటీల్లో (Commonwealth Games 2022) తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) మెరిసింది. మహిళల సింగిల్స్‌లో (Women Singles) కెనడాకు (Canada) చెందిన మిచెలి లీని (Michelle Li) ఓడించి ఫైనల్‌లో సత్తా చాటింది. భారత్‌కు స్వర్ణాన్ని సాధించిపెట్టింది. వరుస సెట్లలో సింధు మిచెలీపై పైచేయి సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్‌లో మిచెలి లీపై 21-15, 21-13 తేడాతో రాణించి పీవీ సింధు జైత్ర యాత్ర సాగించింది. కెరీర్‌లో తొలిసారి కామన్వెల్త్‌లో పీవీ సింధు స్వర్ణం సాధించడం విశేషం. కామన్వెల్త్‌లో పతకం సాధించిడం మాత్రం సింధుకు ఇదేం తొలిసారి కాదు. 2014లో కాంస్య పతకం, 2018లో రజత పతకాన్ని పీవీ సింధు సాధించడం గమనార్హం.



సింధు తాజాగా సాధించిన స్వర్ణ పతకంతో కలిపి కామన్వెల్త్‌లో భారత్ ఇప్పటివరకూ 56 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సింధు స్వర్ణం సాధించడంతో అప్పటివరకూ ఐదో స్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఇప్పటివరకూ 19 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 22 కాంస్య పతకాలు గెలుచుకుంది. సిల్వర్ కంటే గోల్డ్ మెడల్స్ ఎక్కువ సాధించడం విశేషం.

Updated Date - 2022-08-08T20:58:48+05:30 IST