గులాబీ, ఎర్రజెండాలు కలుస్తున్నాయి

ABN , First Publish Date - 2021-04-14T05:43:51+05:30 IST

కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగకముందే నగరంలో సరికొత్త పొత్తులు పొడుస్తున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత తొలిసారి టీఆర్‌ఎస్‌తో దోస్తీకట్టేందుకు వామపక్షాలు ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గులాబీ, ఎర్రజెండాలు కలుస్తున్నాయి

మారబోతున్న కార్పొరేషన్‌ రాజకీయ ముఖచిత్రం


ఖమ్మం, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగకముందే నగరంలో సరికొత్త పొత్తులు పొడుస్తున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత తొలిసారి టీఆర్‌ఎస్‌తో దోస్తీకట్టేందుకు వామపక్షాలు ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం, సీపీఐ తద్వారా ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ పొత్తుదిశగా అడుగులు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలు కూడా టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సై అంటున్నారని సమాచారం. ఇప్పటివరకు వామపక్షాలు జిల్లాలో ఆయా ఎన్నికల్లో టీడీ పీ, కాంగ్రెస్‌ పార్టీల తో పొత్తులు పెట్టుకున్నాయి. కొన్ని సందర్భా ల్లో ఒంటరిగా పోటీచేశాయి. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మారుతున్న రాజకీయ ముఖచిత్రాన్ని దృష్టిలో పెట్టు కుని టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యేం దకు వామపక్షాలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీని కట్టడిచేయాలంటే టీఆర్‌ఎస్‌ వైపే వెళ్లాలని వామపక్ష పార్టీల ముఖ్యనేతలు కూడా తెరవెనుక చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.


ఖమ్మం కార్పొరేషన్‌కు గతంలో జరిగిన ఎన్నికల్లో సీపీఐ 

కాంగ్రెస్‌తో పొత్టుపెట్టుకుని రెండు డివిజన్ల గెలించింది. సీపీఎం ఒంటరిగా పోటీచేసి రెండు డివిజన్లలో విజయం సాధించింది. మొదట్లో కాంగ్రెస్‌తో కూటమిగా వెళ్లాలని వామపక్షాలు ఆసక్తిచూపినా భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్‌ వైపు వెళ్లడమే మంచిదన్న భావన సీపీఎం, సీపీఐ నేతల్లో వ్యక్తమవుతోంది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌తో వామపక్షాలు దోస్తీగా వెళ్లే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్‌కు వస్తే 60డివిజన్లలో చెరో ఐదు డివిజన్లు కావాలని అడగుత్నుట్టు తెలుస్తోంది. అయితే సీపీఎం4, సీపీఐ3కు డివిజన్లు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. బుధవారం డివిజన్ల రిజర్వేషన్లు ఖరారవుతున్న నేపథ్యంలో వామపక్షాలు తాము పోటీచేసే డివిజన్లను టీర్‌ఎస్‌కు సూచించే అవకాశం ఉంది. సీపీఐకి టీఆర్‌ఎస్‌కు స్థానికంగా కొంత అనుబంధం ఉన్నందున ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారన్న పరస్థితి నెలకొంది. సీపీఎంకు కేటాయించే డివిజన్ల ప్రకరారం అధికారికంగా పొత్తుకు సై అనే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఖమ్మం కార్పొరేషన్‌లో వామపక్షాలదే కీలకపాత్ర, మునిసిపాలిటీ ఉన్నప్పుడు ఏకపక్షంగా ఎర్రజెండా ఎగురవేసిన వామపక్షాలు ఒకటి రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందగలిగింది. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంతోపాటు జిల్లాలో కూడా వామపక్ష ఓటుబ్యాంకు గణనీయంగా దెబ్బతింది. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. తాజా రాజకీయ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్‌ వైపు వామపక్షాలు ఆసక్తిచూపుతున్నాయి. వామపక్షాలతో పోటీచేయాలని కాంగ్రెస్‌ ఆరాటపడుతున్నా ఇందుకు వామపక్షాలు కాంగ్రెస్‌కు చేయిచ్చే అవకాశం నెలకొంది. 


Updated Date - 2021-04-14T05:43:51+05:30 IST