సమాజ అభివృద్ధి ప్రదాతలు కళాకారులు

ABN , First Publish Date - 2021-12-06T06:21:16+05:30 IST

కళాకారులు సమాజాఽభివృద్ధికి ప్రదాత లని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు.

సమాజ అభివృద్ధి ప్రదాతలు కళాకారులు
కళాకారులను సన్మానిస్తున్న హోప్‌ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 5: కళాకారులు సమాజాఽభివృద్ధికి ప్రదాత లని  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో హోప్‌ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్‌ అకాడమి ఆధ్వర్యంలో పలు రంగాల్లో సేవలందిస్తు న్న వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడారు. సినీ రంగ స్థల నటుడు గుంటి పిచ్చయ్య, జూనియర్‌ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు, రుక్మారావు, విజయ, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ పాలవెల్లి రమేష్‌నాయుడు, దేవరకొండ వనజలను సన్మానించారు. కార్యక్రమంలో దైద అనిత, వెంకన్న, మన్నెం కృష్ణంరాజు, నర్సయ్య, సైదులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-06T06:21:16+05:30 IST