Abn logo
Sep 22 2021 @ 23:05PM

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ప్రజాసంఘాల ధర్నా

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 22: జిల్లాలో సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలను ఇవ్వాలని బుధవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్ట ణంలోని ప్రధానవీధుల గుండా ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా డీసీసీ ఆధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, టీఏజీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్‌ మాట్లాడుతూ అటవీ హక్కు చట్టం అమలు చేస్తూ జూన్‌2, 2014వరకుసాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్‌చేశారు. అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని, రైతుల భూములను లాక్కొనే విధానాన్ని మానుకోవాలన్నారు. జిల్లాలో రెండుదఫాలుగా కురిసిన భారీవర్షాలకు పంట నష్ట పోయిన రైతాంగానికి పరి హారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపుకలెక్టర్‌ రాజే శంకు అందజేశారు. కార్యక్ర మంలో ఆయా సంఘాల నాయకులు లోకేష్‌, మల్లయ్య, శ్రీనివాస్‌, శ్యాంరావు, భీమేష్‌, శేఖర్‌,అనిత పాల్గొన్నారు.