Abn logo
Sep 19 2020 @ 12:23PM

ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోంది : సత్యేంద్ర జైన్

Kaakateeya

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోందని భావిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. ఇది అంగీకరించాల్సిన విషయం అని అన్నారు. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వమో, ఐసీఎంఆర్ మాత్రమే ఓ స్పష్టతనివ్వాలని  ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. అలాంటి సమయంలో సామాజిక వ్యాప్తి తప్పకుండా జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే.’’ అని సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement