పురుషుల్లోనే ఎక్కువ!

ABN , First Publish Date - 2020-05-12T14:35:06+05:30 IST

మహిళలతో పోలిస్తే, పురుషులే కరోనాతో మరణించే అవకాశాలు ఎక్కువ. ఇందుకు కారణం వారిలో హెచ్చు మోతాదులో ఉండే ఒక కీలక ఎంజైమ్‌!

పురుషుల్లోనే ఎక్కువ!

ఆంధ్రజ్యోతి(12-05-2020):

మహిళలతో పోలిస్తే, పురుషులే కరోనాతో మరణించే అవకాశాలు ఎక్కువ. ఇందుకు కారణం వారిలో హెచ్చు మోతాదులో ఉండే ఒక కీలక ఎంజైమ్‌!


‘కొవిడ్‌ - 19’తో మరణించిన, ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకిన ప్రపంచవ్యాప్త  రోగుల గణాంకాలను పరిశీలించినప్పుడు మహిళల కన్నా పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. కరోనా సోకిన పురుషుల్లో లక్షణాలు తీవ్రంగా ఉండడం, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వారి దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం వారు కరోనా సోకి, హార్ట్‌ ఫెయిల్యూర్‌తో మరణించిన 11 ఐరోపా దేశాలకు చెందిన 3,500 మంది పురుషులు, స్త్రీల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో పురుషుల్లో యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2 ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ ఎంజైమ్‌ గుండె, మూత్రపిండాలు, ఇతర ప్రధాన అంతర్గత అవయవాల్లో ఉంటుంది. కరోనా వైరస్‌ సోకిన పురుషుల్లో ఈ ఎంజైమ్‌ పెరిగిపోయి గుండె మీద ఒత్తిడి పెరిగి, హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారి తీస్తోందట!

Updated Date - 2020-05-12T14:35:06+05:30 IST