కంపార్ట్‌మెంట్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించండి

ABN , First Publish Date - 2020-09-23T07:17:38+05:30 IST

కంపార్ట్‌మెంట్‌ పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించాలని సీబీఎ్‌సఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా విద్యార్థులకు కాలేజీల్లో అడ్మిషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాస్తున్న

కంపార్ట్‌మెంట్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించండి

ఫలితాలను సీబీఎస్‌ఈ 

త్వరగా విడుదల చేయాలి

ఈనెల 24 వరకు అకడమిక్‌ 

క్యాలెండరును ప్రకటించొద్దు

యూజీసీకి సుప్రీం కోర్టు సూచన

 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: కంపార్ట్‌మెంట్‌ పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించాలని సీబీఎ్‌సఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా విద్యార్థులకు కాలేజీల్లో అడ్మిషన్లు లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు రాస్తున్న సుమారు 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా సీబీఎ్‌సఈ, యూజీసీ కలిసి పనిచేయాలని నిర్దేశించింది.

సెప్టెంబరు 24 వరకు అకడమిక్‌ క్యాలెండరును ప్రకటించవద్దని కూడా యూజీసీని కోరింది.  అకడమిక్‌ క్యాలెండరును ఇప్పటికే ప్రకటించడంపై గురువారం వివరణ ఇవ్వాలని కోర్టు యూజీసీని ఆదేశించింది. కాగా, సీబీఎ్‌సఈ కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.


Updated Date - 2020-09-23T07:17:38+05:30 IST