పరిహారం పెట్రోల్‌ ఖర్చులకే చాలదు

ABN , First Publish Date - 2021-03-02T06:09:55+05:30 IST

ఏనుగుల దాడి బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం తాము తిరగడానికి పెట్రోల్‌ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని పలమనేరు మండలం కీలపట్ల పంచాయతీలోని గాంఽధినగర్‌, కురప్పల్లె, మాదిగపల్లె ఎస్టీకాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

పరిహారం పెట్రోల్‌ ఖర్చులకే చాలదు
కలెక్టరేట్‌కు వచ్చిన ఏనుగుదాడి బాధితులు

  కలెక ్టరేట్‌ వద్ద ఏనుగుల దాడి బాధితులు 

చిత్తూరు, మార్చి 1: ఏనుగుల దాడి బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం తాము తిరగడానికి పెట్రోల్‌ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని పలమనేరు మండలం కీలపట్ల పంచాయతీలోని గాంఽధినగర్‌, కురప్పల్లె, మాదిగపల్లె ఎస్టీకాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వో మురళికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎకరా టమోటా పంట సాగు చేసేందుకు రెండు లక్షలు అవుతుందని, అయితే ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ. 3వేలు మాత్రమే ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడానికి పెట్రోల్‌ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కష్టాలను చూసి ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలన్నారు. రైతుల పొలాల్లోకి ఏనుగులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-03-02T06:09:55+05:30 IST