మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-11-26T09:56:44+05:30 IST

హైదరాబాద్‌-ముంబై మధ్య ఏర్పాటుకానున్న హై స్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భూములు కోల్పోతున్న వారికి మార్కెట్‌ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి

  • ‘హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌’లో భూములు కోల్పోనున్నాం
  • ప్రజాభిప్రాయ సేకరణలో వికారాబాద్‌ రైతుల డిమాండ్‌ 

వికారాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-ముంబై మధ్య ఏర్పాటుకానున్న హై స్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భూములు కోల్పోతున్న వారికి మార్కెట్‌ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ అంబేడ్కర్‌ భవన్‌లో నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ జిల్లాలో ప్రతిపాదించిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భూములు కోల్పోను న్న రైతులతో పర్యావరణ, సామాజిక అంశాలపై గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటుతో చేకూరనున్న ప్రయోజనాల గురించి నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కన్సల్టెం ట్లు రైతులకు వివరించారు. కొందరు రైతులు తమకు నష్టపరిహారంతో పాటు తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటైతే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు.

Updated Date - 2021-11-26T09:56:44+05:30 IST