రైతాంగానికి పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-04-14T06:05:11+05:30 IST

మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో సోమవారం కురిసిన వడగళ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్న రై తాంగానికి పరిహారం చెల్లించాలని జడ్పీటీసీ మాలావత్‌ మాన్‌సింగ్‌, ఏఐకేఎంఎస్‌ నాయకులు భాస్కర్‌, రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.

రైతాంగానికి పరిహారం చెల్లించాలి

సిరికొండ, ఏప్రిల్‌ 13: మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల పరిధిలో సోమవారం కురిసిన వడగళ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్న రై తాంగానికి పరిహారం చెల్లించాలని జడ్పీటీసీ మాలావత్‌ మాన్‌సింగ్‌, ఏఐకేఎంఎస్‌ నాయకులు భాస్కర్‌, రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. తూంపల్లి, గోప్యనాయక్‌తండా, వర్జన్‌తండా, కొండపూర్‌, గోప్యాతండా పంచాయతీల పరిధిలో వడగళ్ల వాన కురవడంతో దెబ్బతిన్న పంటలను తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, వ్యవసాయ అధికారి వెంకటేష్‌తో క లిసి జడ్పీటీసీ సభ్యులు మాలావత్‌మాన్‌సింగ్‌ పరిశీలించారు. అంతకముందు ఏఐకేఎంఎస్‌ నాయకులు భాస్కర్‌, రామకృష్ణ, తదితరులు దె బ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నాలుగు గ్రామ పంచాయతీల పరిధి లో రైతులు సాగుచేసిన వరి పంట, నువ్వు పంట నూటికి నూరుశాతం దెబ్బతిందన్నారు. దీని వల్ల రైతుల పరిస్థితి కోలుకోలేని విధంగా తయారైంది. ప్రభుత్వం దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోడానికి తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలని జడ్పీటీసీ విజ్ఞప్తి చేశారు. రైతాంగం ఆరుగాలం కష్టపడిన అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయారని అన్నా రు. ప్రభుత్వం పంటల బీమా వర్తింపచేయడంలేదని రైతులు పంటల బీమాకు డబ్బులు చెల్లిస్తామని ముందుకు వచ్చిన ప్రభుత్వం ప్రీమి యం చెల్లించలేని దుస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి నష్టపోయిన రైతంగాన్ని ఆదుకోవాలని భాస్కర్‌, రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ నాలుగు గ్రామాల్లో 180 మంది రైతులకు సంబంధించిన 580 ఎకరాల్లో పంట దెబ్బతింద ని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌ తెలిపా రు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తా న్నారు. కార్యక్రమంలో సిరికొండ, తూంపల్లి, సొసైటీ అధ్యక్షుడు గంగారెడ్డి, రాములు నాయక్‌, సర్పంచ్‌లు రమేష్‌, శంకర్‌నాయక్‌, రాంచందర్‌, సహకార సంఘాల డైరెక్టర్‌లు ఉన్నారు.

Updated Date - 2021-04-14T06:05:11+05:30 IST