Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి: టీడీపీ

రేణిగుంట, నవంబరు 30: తుఫానుతో పంటలు నష్టపోయిన మండల రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని తెలుగు రైతు, టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలో బి.మల్లవరం, ఆర్‌.మల్లవరం, ఎల్‌ఎన్‌కండ్రిగ, కరకంబాడి తదితర ప్రాంతాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలు, తోటలను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తెలుగు రైతు నేత చిన్నారెడ్డి మాట్లాడుతూ మండలంలో పర్యటించిన కేంద్ర బృంద సభ్యులు ఓ రైతుకు చెందిన అరటితోటను మాత్రమే పరిశీలించారని చెప్పారు. అయితే నష్టపోయిన వరి రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టంపై అంచనా నివేదికలను ప్రభుత్వానికి పంపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు మునిచంద్రశేఖర్‌రెడ్డి, మహబూబ్‌బాషా, మునస్వామి నాయుడు, సుబ్బిరామిరెడ్డి, బుజ్జినాయుడు, ఉదయ్‌కుమార్‌, కన్నారెడ్డి, కుమార్‌, అఫ్రోజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement