22న జీవ వైవిధ్య పరిరక్షణపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు పోటీలు

ABN , First Publish Date - 2021-05-17T04:25:01+05:30 IST

జిల్లాలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు జీవ వైవిధ్య పరిరక్షణపై ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

22న జీవ వైవిధ్య పరిరక్షణపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు పోటీలు

భీమునిపట్నం (రూరల్‌), మే 16: జిల్లాలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు జీవ వైవిధ్య పరిరక్షణపై ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్‌ లేదా పెయింటింగ్‌ కార్టూన్లు, వ్యాసరచన, కవితలు, పాటలు ఫొటోగ్రఫీలలో ఈ పోటీలు ఉంటాయన్నారు. ఆరు, ఎనిమిది తగరతుల విద్యార్థులు సబ్‌ జూనియర్లుగా, తొమ్మిది, పదో తరగతి వారు జూనియర్లుగా, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, తదితర విద్యార్థులను సీనియర్లుగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఇతర విభాగాలుగా పరిగణిస్తామని అన్నారు. ఈనెల 22వ తేదీన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తామని, పోటీలో పాల్గొనే వారికి సర్టిఫికెట్లు, పుస్తకాలను బహుమతులుగా అందిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 19వ తేదీలోగా తమ వివరాలు, రచనలను గూగుల్‌ లింక్‌ ద్వారా పంపించాలన్నారు. ఈ లింక్‌ కోసం 8801000014 సెల్‌ నంబర్‌ను సంప్రదించాలని లింగేశ్వరరెడ్డి కోరారు.

Updated Date - 2021-05-17T04:25:01+05:30 IST