Abn logo
Sep 24 2021 @ 16:56PM

ఎస్జీటీలకు ప్రమోషన్స్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు

కర్నూలు: ఎస్జీటీలకు ప్రమోషన్స్ ఇవ్వడంతో తమకు జరిగిన అన్యాయంపై లోకాయుక్త, హెచ్‌ఆర్సీ కార్యాలయాల్లో రాయలసీమ జిల్లాల భాషోపాధ్యాయులు ఫిర్యాదు చేసారు. ఎస్జీటీలకు ప్రభుత్వం ప్రమోషన్స్ ఇవ్వడం వలన తమకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. 2018లో టీడీపీ ప్రభుత్వం 91 జీవో ప్రకారం భాషోపాధ్యాయులకు ప్రమోషన్స్ కల్పించి ఉత్తర్వులు జారీచేసిందన్నారు. కానీ అర్హత లేని 1370 మంది ఎస్జీటీలకు ప్రమోషన్లను విద్యాశాఖ అధికారులు ఇచ్చారని వారు పేర్కొన్నారు. దీనివల్ల ప్రతినెలా ఆరుకోట్ల ప్రజాధనం వృథా అవుతోందన్నారు.


తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదన్నారు. ప్రాధాన్యత లేని స్థానాల్లో ఉంచి భాషోపాధ్యాయులను అవమానపరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసారు. ఎస్జీటీలకు ఇచ్చిన ప్రమోషన్స్ వెంటనే రద్దు చేయాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేసారు.