వంశధార కాలువలో పైపులు ఏర్పాటుపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-08-04T10:21:48+05:30 IST

వంశధార 15 టి.ఉరజాం మేజర్‌ కాలువలో యాట్లబసివలస, చెల్లాయివలస, కింజరాపువానిపేట, కమ్మరిపేట, గ్రామాలకు చెందిన రైతులు పైపులను ..

వంశధార కాలువలో పైపులు ఏర్పాటుపై ఫిర్యాదు

పోలాకి, ఆగస్టు 3: వంశధార 15 టి.ఉరజాం మేజర్‌ కాలువలో యాట్లబసివలస, చెల్లాయివలస, కింజరాపువానిపేట, కమ్మరిపేట, గ్రామాలకు చెందిన రైతులు పైపులను అర్ధరాత్రి రహస్యంగా ఏర్పాటు చేశారని, దీంతో దిగువ ప్రాంత పొలాలకు సాగునీరందడం లేదని సాగునీటి సంఘం నాయకుడు కరిమిరాజేశ్వరరావు, సంపతిరావు రామన్న, కణితి కృష్ణారావు తదితరులు సోమవారం రెవెన్యూ  ‘స్పందన’లో  ఫిర్యాదు చేశారు. వంశధార అధికారులు హిరమండలం ప్రాజెక్టు వద్ద సాగునీరు విడిచిపెట్టామని చెబుతున్నారని, అయితే కాలువ కప్పివేయడంతో సాగునీరు రావడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.  ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని పంటలను రక్షించాలని  తహసీల్దార్‌ ఎ.సింహాచలం, డీటీ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు.

Updated Date - 2020-08-04T10:21:48+05:30 IST