Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 30 2021 @ 17:26PM

తెలుగు అకాడమీపై మరో ఫిర్యాదు

హైదరాబాద్‌: సీసీఎస్‌లో తెలుగు అకాడమీపై మరో ఫిర్యాదు వచ్చింది. సీసీఎస్‌లో ఇప్పటికే తెలుగు అకాడమీపై మూడు కేసులు నమోదయ్యాయి. తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంకు అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిధుల బదలాయింపులో అగ్రసేన్ బ్యాంకుతో పాటు రత్నాకర్ బ్యాంకు ప్రతినిధుల పాత్రపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ బ్యాంక్ నుంచి బదిలీ అయిన నిధులు మొత్తం ఒకే అకౌంట్‌కు చేరినట్టుగా గుర్తించారు. తెలుగు అకాడమీ, యూనియన్ బ్యాంక్ మధ్య ఏజెంట్లుగా వ్యవహరించిన వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. కార్వాన్ బ్రాంచ్‌ నుంచి రూ.43 కోట్లు, చందా నగర్ కెనారా బ్యాంక్ నుంచి రూ. 10 కోట్లు, సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 8 కోట్లు బదిలీ అయినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement