Apr 19 2021 @ 20:32PM

కరోనా టీకాతోనే వివేక్‌ మృతి.. మన్సూర్‌ అలీఖాన్‌పై డీజీపీకి ఫిర్యాదు

కరోనా టీకా గురించి దుష్ప్రచారం చేస్తున్నందుకు గాను సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ప్రజలను భయపెట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సినీ నటుడు వివేక్‌ గుండెపోటుతో మరణించారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించేందుకు వెళ్ళి.. కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్లే వివేక్‌ చనిపోయారంటూ ఆరోపించారు. అదే సమయంలో కేంద్రప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు చెన్నై నగర కార్పొరేషన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కమిషనరు ప్రకాష్‌ ఆదివారం మాట్లాడుతూ, నటుడు వివేక్‌ మృతికి, కరోనా వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కరోనా టీకాపై దుష్ప్రచారం చేసిన మన్సూర్‌ అలీఖాన్‌పై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండిImage Caption

‘కరోనా టీకా కారణంగానే వివేక్‌ మృతి’