Abn logo
Apr 9 2021 @ 01:35AM

సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

వెంచర్‌లో గ్రామ పంచాయతీకి తక్కువ భూమి తీసుకున్నారని ఫిర్యాదు

నాగారం, ఏప్రిల్‌ 8: ఓ వెంచర్‌లో గ్రామపంచాయతీకి రావాల్సిన వాటాలో తక్కువ భూమిని తీసుకున్నారని నాగారం సర్పంచ్‌పై సామాజిక కార్యకర్త ఆకుల  ప్రతాప్‌ కలెక్టర్‌, ఆర్డీవో, డీపీవోలకు గురువారం ఫిర్యాదుచేశారు.  ప్రతాప్‌ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా నాగారం పోలీ్‌సస్టేషన్‌కు ఎదురుగా సర్వే నెంబరు 446లో రెండు ఎకరాల 14 గుంటల భూమిలో వెంచర్‌ ఏర్పాటుచేశారు. నిబంధన ప్రకారం గ్రామపంచాయితీకి 10శాతం(తొమ్మిది గుంటల భూమి) ఇవ్వాల్సి ఉండగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులతో సర్పంచ్‌ కుమ్మక్కై ఆరు గుంటల భూమికే ఒప్పు కుంటున్నట్ల్లు గత నెల రెండో తేదీన గ్రామసభలో తీర్మానించారన్నారు. దీనిపై విచారణ జరిపించాలని అధికారులను కోరినట్లు ప్రతాప్‌ తెలిపారు.


Advertisement
Advertisement