Abn logo
Oct 20 2021 @ 02:42AM

మోహన్‌బాబుపై ఫిర్యాదుల వెల్లువ

అరెస్టు చేయాలని గొర్రెల కాపరుల డిమాండ్‌హనుమకొండ/యాచారం/కందుకూరు/నర్సంపేట టౌన్‌, అక్టోబరు 19: తమను కించపరిచేలా మాట్లాడిన సినీనటుడు మంచు మోహన్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో  గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం(జీఎంపీఎస్‌) నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల ‘మా’ ఎన్నికల సందర్భంగా తోటి నటులను ఉద్దేశించి ‘‘ఈ కాలంలో గొర్రెల కాపరుల వద్దా సెల్‌ఫోన్లు ఉన్నాయి. ప్రపంచంలో ఏం జరుగుతోందో వారు కూడా తెలుసుకుంటున్నారు’’ అని గొర్రెల కాపర్లను కించపరిచేలా ఆయన మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, వరంగల్‌ జిల్లా నర్సంపేట , మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌, తొర్రూరు, హనుమకొండ జిల్లా ఆత్మకూరు, వరంగల్‌ జిల్లా నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, జనగామ జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.