30 నాటికి నిర్మాణం పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-06-20T05:09:12+05:30 IST

ఈనెల 30 నాటికి జిల్లాలో గ్రామ సచివాలయాల భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా) జల్లేపల్లి వెంకటరావు స్పష్టంచేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఆదేశించారు. కొటారుబిల్లి, కొర్లాం, గంట్యాడ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల భవనాలను ఆయన శనివారం పరిశీలించారు.

30 నాటికి నిర్మాణం పూర్తి చేయండి
నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జేసీ వెంకటరావు

సచివాలయ భవనాలను పరిశీలించిన జేసీ వెంకటరావు 

గంట్యాడ, జూన్‌ 19: ఈనెల 30 నాటికి జిల్లాలో గ్రామ సచివాలయాల భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌(ఆసరా) జల్లేపల్లి వెంకటరావు స్పష్టంచేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఆదేశించారు. కొటారుబిల్లి, కొర్లాం, గంట్యాడ గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ హెల్త్‌ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల భవనాలను ఆయన శనివారం పరిశీలించారు. అక్కడి నుంచి పెదమజ్జిపాలెం గ్రామంలోని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భవన నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు నిధుల సమస్య లేదని, నిర్మాణ ప్రగతిని తెలియజేస్తే బిల్లులు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. సచివాలయ భవనాలు ఈనెల 30 నాటికి, రైతు భరోసా కేంద్రాలు వచ్చే 8 నాటికి, గ్రామ ఆరోగ్య కేంద్రాలు జూలై 30 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలోని 664 గ్రామ సచివాలయ భవనాలకు గాను దాదాపు 524 భవనాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని వివరించారు. 618 రైతు భరోసా కేంద్రాలకు గాను 296 పూర్తి కానున్నాయని, 445 గ్రామ ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేయగా, వీటిలో 180 పూర్తయ్యాయని చెప్పారు. ఆయన వెంట పంచాయతీరాజ్‌ జేఈ కొల్లి కృష్ణమూర్తి, ఇందిర క్రాంతి పథం ఏపీఎం శ్రీనివాస్‌, ఏపీవో వెంకట అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-06-20T05:09:12+05:30 IST