నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-06-07T06:48:54+05:30 IST

వచ్చే నెలాఖరుకు నాడు- నేడు పనులు పూర్తి కావాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ స్పష్టం చేశారు.

నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయండి

పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌ వచ్చే నెలాఖరులోగా పాఠశాలలను సిద్ధం చేయాలి 

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ 


విజయనగరం, జూన్‌ 6: వచ్చే నెలాఖరుకు నాడు- నేడు పనులు పూర్తి కావాలని కలెక్టర్‌   హరిజవహర్‌లాల్‌ స్పష్టం చేశారు. సచివాలయాల నిర్మాణాలు కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని మండలాల అధికారులతో కలెక్టర్‌ శనివారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌, నాడూ నేడు పనులు, సచివాలయాలు,  రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. మొక్కలు నాటే కార్యక్రమం, చెరువుల శుద్ధి, గ్రామాల్లో పారిశుధ్య పనుల అమలు గురించి అడిగి తెలుసుకు న్నారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా 24గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ కూర్మనాథ్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఫ విజయనగరం టౌన్‌: నగరంలోని పలు పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులను ప్రజారోగ్యశాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు  పరిశీలించారు.


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.3.2 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో పూర్తిస్థాయిలో అన్ని రకాల పనులు, మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నాణ్యతలో రాజీ పడొద్దన్నారు.


రామభద్రపురం: ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్‌ ఉద్యోగులతో  ఎంపీడీవో బి.ఉషారాణి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ మండలంలో 26 పాఠశాలల్లో కరెంటు, పారిశుధ్యం, మరమ్మ తులను త్వరగా పూర్తి చేయాలన్నారు.  రాబోయే విద్యా సంవత్సరానికి అన్ని స్కూళ్లు సిద్ధంగా ఉండాలని, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లు అంచనాలు సక్రమంగా వేయాలని ఆదేశించారు.  సమా వేశంలో ఎస్‌ఎస్‌ఏ ఏఈ శ్రీరామ్మూర్తి, ఎంఈవో తిరుమలప్రసాద్‌ పాల్గొన్నారు.


బొబ్బిలి:  స్థానిక కోరాడవీధి పొట్టి శ్రీరాములు హైస్కూలు, గొల్లపల్లి శ్రీవేణుగోపాల హైస్కూల్లో నాడు-నేడు పనులను కమిషనర్‌ ఎంఎం నాయుడు పరిశీలించారు.  సుమారు  రూ.18 కోట్లతో ఆరు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలి పారు.  నాణ్యతా లోపం లేకుండా నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని ఇంజనీ రింగ్‌ సిబ్బందిని ఆదేశించారు.


తెర్లాం:  డి.గదబవలసలోని ఎంపీయూపీ పాఠశాలలో పనులను ఎంఈవో త్రినాథరావు పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యతా లోపించకుండా చూడాలని సూచించారు. హెచ్‌ఎం శేషగిరిరావు, సీఆర్‌పీలు, స్కూల్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

 

కొత్తవలస రెండో స్థానం 

కొత్తవలస/ రూరల్‌: నాడు-నేడు పనుల్లో కొత్తవలస మండలం జిల్లాలో రెండో స్థానంలో ఉందని జిల్లా సమగ్ర శిక్ష అకాడమిక్‌ మోనటరింగ్‌ అధికారి బి.అప్పారావు అన్నారు. వియ్యంపేట స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని వీరభద్రపురం, ముసిరాం, గ్రామాల్లోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న నాడు-నేడు పనులను ఆయన  పరి శీలించారు. జూలై 31 నాటికి పనులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలని పాఠశాలల హెచ్‌ఎంలు, సీఆర్పీలను ఆదేశించారు. 

Updated Date - 2020-06-07T06:48:54+05:30 IST