సజావుగా ఎన్నికలు పూర్తిచేయండి

ABN , First Publish Date - 2021-03-06T04:24:49+05:30 IST

శించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పీవోలు, ఏపీవోలకు శిక్షణనిచ్చారు. వారిని ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జ

సజావుగా ఎన్నికలు పూర్తిచేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌




కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, మార్చి 5: సమన్వయంతో పనిచేసి మునిసిపల్‌ ఎన్నికలు సజావుగా  పూర్తిచేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పీవోలు, ఏపీవోలకు శిక్షణనిచ్చారు. వారిని ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఓటింగ్‌ శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. శిక్షణ అధికారి అప్పలనాయుడు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివిధ అంశాలను వివరించారు. కార్యక్రమంలో జేసీ కిషోర్‌కుమార్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాదరావు పాల్గొన్నారు. 



1111111111111111111111111111111111111111111111111111

Updated Date - 2021-03-06T04:24:49+05:30 IST