కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ పూర్తి

ABN , First Publish Date - 2021-01-09T05:51:14+05:30 IST

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతమైంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 47కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా డ్రైరన్‌ నిర్వహించామని డీఎంహెచ్‌వో కొండల్‌రావు ప్రకటించారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ పూర్తి
నల్లగొండ, యాదాద్రి జిల్లాలో డ్రైరన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్లు ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, అనితారామచంద్రన్‌

సూర్యాపేట, యాదాద్రి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి)/నల్లగొండ అర్బన్‌: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతమైంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 47కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా డ్రైరన్‌ నిర్వహించామని డీఎంహెచ్‌వో కొండల్‌రావు ప్రకటించారు. కొన్నిచోట్ల సర్వర్‌ సమస్య తలెత్తడంతో ఆఫ్‌లైన్‌లో ప్రక్రియను పూర్తిచేసి డ్రైరన్‌ పూర్తి చేశారు. మొత్తం 1178మందికి డ్రైరన్‌ టీకా వేశారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, మాన్యంచెల్క, లైన్‌వాడ, పానగల్‌, రాములబండ కేంద్రాలను కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ సందర్శించి డ్రైరన్‌ను పరిశీలించారు. పట్టణ ఏరియా ఆస్పత్రిలో డ్రైరన్‌ కార్యక్రమాన్ని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి మాత్రునాయక్‌ ప్రారంభించి వైద్యులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అడవిదేవులపల్లి, వేములపల్లి, హాలియా, కనగల్‌, నకిరేకల్‌ మండలం ఓగోడు, నార్కట్‌పల్లి, అక్కెనపల్లి, చిట్యాల, కేతేపల్లి శాలిగౌరారం, తిప్పర్తి, పెద్దఅడిశర్లపల్లి పీహెచ్‌సీలు, సాగర్‌లోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ నిర్వహించారు. దేవరకొండ డివిజన్‌లో కరోనా డ్రైరన్‌ను విజయవంతంగా  నిర్వహించామని డిప్యూటీ డీఎంహెచ్‌వో కృష్ణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.

 సూర్యాపేట జిల్లాలో 31 కేంద్రాల్లో 778 మందికి డ్రైరన్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. తిరుమలగిరిలో డ్రైరన్‌ను ఫ్యామిలీ ప్లానింగ్‌ జేడీ డాక్టర్‌ రజనీ, డీఎంహెచ్‌వో హర్షవర్ధన్‌, డీఐవో వెంకటరమణ పరిశీలించారు. చిలుకూరులో డిప్యూటీ డీఎంహెచ్‌వో నిరంజన్‌, అనంతగిరి, మునగాల మండలాల్లో ఎంసీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ కల్యాణచక్రవర్తి డ్రైరన్‌ను పరిశీలించి, వైద్యసిబ్బందికి అవగాహన కల్పించారు. గరిడేపల్లిలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సాహితి,  కోదాడలో ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రజిని పరిశీలించారు. తిరుమలగిరి మండలంలోని పలు ఆస్పత్రుల్లో జిల్లా ప్రోగ్రామింగ్‌ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. 

యాదాద్రి జిల్లాలో 24 కేంద్రాల్లో 500 మందికి డ్రైరన్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. వలిగొండ మండలం వర్కట్‌పల్లి పీహెచ్‌సీ కేం ద్రంలో డ్రైరన్‌ను కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పరిశీలించారు. ఆమెతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో డ్రైరన్‌ను ట్రైనీ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌, అదనపు కలెక్టర్లు డి.శ్రీనివా్‌సరెడ్డి, ఖిమ్యానాయక్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిప్రకాష్‌, డాక్టర్‌ కె.రాధాకృష్ణమూర్తి, డాక్టర్‌ మురళి కృష్ణ పర్యవేక్షించారు. మోత్కూరులో డీఎంహెచ్‌వో బి.సాంబశివరావు పరిశీలించారు. భూదాన్‌పోచంపల్లి పీహెచ్‌సీలో డ్రైరన్‌పై డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.మనోహర్‌ సమీక్ష నిర్వహించారు. గుండాల, అడ్డగూడూరు, రాజాపేట, సంస్థాన్‌నారాయణపురం, యాదగిరిగుట్ట, ఆత్మకూరు(ఎం) పీహెచ్‌సీల్లో డ్రైరన్‌ నిర్వహించారు.

Updated Date - 2021-01-09T05:51:14+05:30 IST