ముగిసిన వారోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-21T04:59:17+05:30 IST

అగ్నిప్రమాదాలు జరిగినపుడు ప్రజలు ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఈ నెల 14వ తేది నుంచి 20వ తేది వరకు జిల్లా అగ్నిమాపక శాఖ అవగాహనా వారోత్సవాలు నిర్వహించింది.

ముగిసిన వారోత్సవాలు

కర్నూలు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): అగ్నిప్రమాదాలు జరిగినపుడు ప్రజలు ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఈ నెల 14వ తేది నుంచి 20వ తేది వరకు జిల్లా అగ్నిమాపక శాఖ అవగాహనా వారోత్సవాలు నిర్వహించింది. ఈ వారోత్సవాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజున స్థానిక సప్తగిరి నగర్‌లోని అగ్నిమాపక కేంద్ర ప్రాంత ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఎలా స్పందించాలన్న విషయాన్ని కర్నూలు అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్‌ వివరించారు. ప్రమాదాలు జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలను ఆర్పే విధానాన్ని ప్రయోగ పూర్వకంగా చేసి చూపించి, వాటికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


ఆలూరు రూరల్‌: అగ్నిప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆలూరు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ అరుణదేవి, అగ్నిమాపక అధికారి సయ్యద్‌హైయత్‌బాషాఖాద్రి సూచించారు. మంగళవారం అగ్నిమాపక వారోత్స వాల్లో భాగంగా అగ్నిమాపక కార్యాలయంలో ముగింపు సభ నిర్వహించారు. కార్యక్ర మంలో సామాజిక కార్యకర్త కమలాకర్‌నాయుడు, అగ్నిమాపక ఎల్‌ఎఫ్‌ మాబుబేగ్‌, నటరాజు, ఫైర్‌మన్‌ గోపాల్‌, బాషా పాల్గొన్నారు.


డోన్‌(రూరల్‌): వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బాల చంద్రారెడ్డి సూచించారు. మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బాల చంద్రారెడ్డి మాట్డాలుతూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డోన్‌ అగ్నిమాపక అధికారి శ్రీనివాసుల నాయుడు, వెంకటేశ్వర డిగ్రీ కళాశాల లెక్చరర్లు సుజాత, లక్ష్మణ్‌, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T04:59:17+05:30 IST