ఇళ్ల కొళాయిలు కట్‌ చేయడంపై తహసీల్దార్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-11T06:37:01+05:30 IST

బెల్లంకొండవారిపాలెం పంచాయతీ వెంకటరెడ్డినగర్‌లో నివాసముంటున్న ఎస్టీ, ఎస్సీలకు చెంది న ఇళ్లకు నీటిసరఫరా నిలిపివేయడంపై వారు శనివారం తహసీల్దార్‌, ఎంపీడీవో కు ఫిర్యాదు చేశారు.

ఇళ్ల కొళాయిలు కట్‌ చేయడంపై తహసీల్దార్‌కు ఫిర్యాదు

తాళ్లూరు, ఏప్రిల్‌ 10 : బెల్లంకొండవారిపాలెం పంచాయతీ వెంకటరెడ్డినగర్‌లో నివాసముంటున్న ఎస్టీ, ఎస్సీలకు చెంది న ఇళ్లకు నీటిసరఫరా నిలిపివేయడంపై వారు శనివారం తహసీల్దార్‌, ఎంపీడీవో కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఎస్టీ, ఎస్సీలు దేవరకొండ శాంతి, దేవరకొండ అనీత, సునీత, వై.లక్ష్మయ్య పలువురు ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డినగర్‌ కాలనీలో దాదాపు 50 కుటుంబాలు నివాసముంటున్నాయని, గత ఏడాది నీటిసమస్య తీవ్రంగా ఉండడంతో కొందరు దాతృత్వంతో డీప్‌బోరు వేసి ఇంటింటికి పైపులైను వేసి నీటి సరఫరా చేశారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో  గెలుపొందిన సర్పంచ్‌కు అనుకూలంగా ఓట్లువేయలేదన్న కారణంతో ఎస్టీ, ఎస్టీలకు చెందిన 9 ఇళ్లకు నీటి పైపులను డమ్మీలు బిగించి మిగిలిన వారందరికి నీటిని సరఫరా చేయటం ఎంతవరకు న్యాయమని కోరారు. గ్రామకార్యదర్శి, ప్రత్యేకాధికారిదృష్టికి తీసుకువెళ్లినా వారు స్పందించలేదన్నారు. గ్రామంలో తాముపడుతున్న నీటి కష్టాలను గుర్తించి పరిష్కరించలేదంటే వారికి ఎస్సీ, ఎస్టీల పట్ల చిన్నచూపు ఉందని అర్థమౌతోందన్నారు. అధికారులు స్పందించకుంటే తాము ఎస్టీ కమీషన్‌ వద్దకు వెళ్లి  జరిగిన అన్యాయాన్ని విన్నవిస్తామని తెలిపారు.

Updated Date - 2021-04-11T06:37:01+05:30 IST