అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T06:30:56+05:30 IST

నిర్మల్‌ ఈద్‌గాం ప్రాంతంలో చౌరస్తా నుండి చేపల మార్కెట్‌ వరకు నిర్మిస్తున్న రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలని మంత్రి ఐకేరెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలి
పనులను పరిశీలిస్తున్న మంత్రి ఐకేరెడ్డి

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 3 : నిర్మల్‌ ఈద్‌గాం ప్రాంతంలో చౌరస్తా నుండి చేపల మార్కెట్‌ వరకు నిర్మిస్తున్న రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలని మంత్రి ఐకేరెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, చైర్మన్‌ జి. ఈశ్వర్‌తో కలిసి పనులు పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం గాంధీచౌక్‌లో జరుగుతున్న పనులు పరిశీలించారు. కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

నిర్మల్‌ నలువైపులా సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు

నిర్మల్‌ నలువైపులా సెంట్రల్‌ లైటింగ్‌ పూర్తి చేసుకున్నామని మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్‌ శాఖ కొనుగోలు చేసిన హైడ్రాలిక్‌ మౌంటెడ్‌ లాడర్‌ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 జంక్షన్‌లలో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లైటింగ్‌ సిస్టంలో తలెత్తే సమస్యలు పరిష్కారానికి లాడర్‌ వాహనం ఉపయోగపడుతుందన్నారు. నిర్మల్‌ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌, కమిషనర్‌ బాలకృష్ణ, నాయ కులు వెంకట్రాంరెడ్డి, రాంకిషన్‌రెడ్డి,  ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయ కులు పాల్గొన్నారు. 

బ్లాంకెట్ల పంపిణీ

 పేద మహిళలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం బ్లాంకెట్లు, స్కార్ప్‌లు పంపిణీ చేశారు. కౌన్సిలర్‌ ముజాహిద్‌అలీ వీటిని సమకూర్చగా ఫలాహ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో 150 మందికి అందజేశారు. కలెక్టర్‌ ఫారూఖీ, చైర్మన్‌ జి. ఈశ్వర్‌, సొసైటీ కార్యదర్శి అబ్దుల్లా, నయీంఓద్దీన్‌, కౌన్సిలర్లు అబ్రార్‌, ముజాహిద్‌ బిన్‌ మొహ్మద్‌, రఫీయుద్దీన్‌, కోఆప్షన్‌ మెంబర్‌ సయ్యద్‌ మజహర్‌తో పాటు ఫిర్దోస్‌ అలీ, ఫెరోజ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T06:30:56+05:30 IST