రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-03-03T05:08:50+05:30 IST

కరోనా టీకా వేయించుకున్నప్పటి నుంచి అనారోగ్యం పాలైన అంగన్‌వాడీ కార్యకర్త నల్లూరి సునీత తిరుపతి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించిన సం గతి తెలిసిందే.

రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
కలెక్టర్‌తో మాట్లాడుతున్న అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యులు

మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి

కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన అంగన్‌వాడీ యూనియన్‌ సభ్యులు

సింగరాయకొండ, ఫిబ్రవరి 2 : కరోనా టీకా వేయించుకున్నప్పటి నుంచి అనారోగ్యం పాలైన అంగన్‌వాడీ కార్యకర్త నల్లూరి సునీత తిరుపతి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించిన సం గతి తెలిసిందే. మంగళవారం అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సభ్యు లు కలెక్టర్‌ను కలిసి మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇంటి స్థలాన్ని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మృతురాలు ఆరోగ్యం బాగోలేదని నడుము నొప్పి వస్తుందని రాతపూర్వకంగా వద్దని చెప్పినా బలవంతంగా వ్యాక్సిన్‌ వేశారని, వే యించుకోకపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తామని అధికారులు బెదిరించారని యూనియన్‌ సభ్యులు కలెక్టర్‌కి వివరించారు. మృతురాలు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొని వికటించడం వల్లే చనిపోయిందని తెలిపారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఐ.వేమేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు ఎలిజిబెత్‌, ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసులు ఉన్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్న పోలీసులు

అంగన్‌వాడీ టీచర్‌ సునీత మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున పోలీసులు శవపరీక్ష నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. శవపరీక్ష మధ్యాహ్న సమయానికి పూరైయ్యింది. ఆ తరువాత స్వగ్రామం కలికివాయి గ్రామానికి తరలించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎల్‌.సంపత్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-03T05:08:50+05:30 IST