Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లా అభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకోవాలి

సీపీఎం నేత ‘పూనాటి’


ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 30 :  జిల్లా ను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి అభివృద్ధికి రూ.10వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని సీపీఎం తూర్పుప్రకాశం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనే యలు డిమాండ్‌ చేశారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న 37అంశాలపై భవిష్యత్‌ పోరాటా లకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఒంగోలు లోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఏ ర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 3,4వ తేదీల్లో సీపీఎం తూ ర్పు ప్రకాశం జిల్లా 13వమహాసభలు అద్దంకిలో జరుగుతాయని తెలిపారు. గత మహాసభల త ర్వాత గడిచిన నాలుగేళ్లకాలంలో జిల్లాలో పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు. అందులో కొన్ని విజయవంతం అయ్యాయని, కొన్ని పోరాటాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.  ప్రజా పోరాటాలపై మహాసభల్లో చర్చించి నిర్ణయాలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ రెండున్న ర ఏళ్ళపాలనలో జిల్లాలో అభివృద్ధి శూన్యమన్నా రు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ లను కూడా విస్మరించారని విమర్శించారు. అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను  అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అ నంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్ర మంలో నాయకులు జీవీ.కొండారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, కంకణాల ఆంజనేయులు, చీక టి శ్రీనివాసరావు, ఎస్‌కే.మాబు పాల్గొన్నారు.  


Advertisement
Advertisement