కల్వకుర్తి లిఫ్టు మునకపై సమగ్ర నివేదిక

ABN , First Publish Date - 2020-10-22T07:02:47+05:30 IST

కల్వకుర్తి మొదటి లిఫ్టు మునకపై సమగ్ర నివేదిక అందజేయాలని ఇరిగేషన్‌ అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఆదేశించారు. లిఫ్టు పునరుద్ధరించే వరకు మిషన్‌భగీరథ

కల్వకుర్తి లిఫ్టు మునకపై సమగ్ర నివేదిక

 ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌ ఆదేశం

నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కల్వకుర్తి మొదటి లిఫ్టు మునకపై సమగ్ర నివేదిక అందజేయాలని ఇరిగేషన్‌ అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఆదేశించారు. లిఫ్టు పునరుద్ధరించే వరకు మిషన్‌భగీరథ తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. బుధవారం నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం రెగుమాన్‌గడ్డ వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు, మిషన్‌భగీరథ ఇంటెక్‌వెల్‌ను ఆమె పరిశీలించారు.


ఈ సందర్భంగా ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించిన స్మితాసబర్వాల్‌.. లిఫ్టు మునకకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. లిఫ్టు పునరుద్ధరణకు పట్టే సమయం, డీవాటరింగ్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి ఆమెకు వివరించారు.

ఇప్పటికే 10 మీటర్ల నీటిని పంపుహౌస్‌ నుంచి బయటికి పంపించేశామని, మరో 30 మీటర్లు డీవాటరింగ్‌ చేసిన తర్వాత సాంకేతికపరమైన సమస్యలను పరిష్కరించి మొదటి పంపును వినియోగంలోకి తెస్తామని చెప్పారు.  


Updated Date - 2020-10-22T07:02:47+05:30 IST