కంప్యూటర్‌ విద్యతో ఉపాధి అవకాశాలు

ABN , First Publish Date - 2021-10-24T05:35:38+05:30 IST

విద్యార్థులు కంప్యూటర్‌ విద్యను అభ్యసించడం వల్ల అనేక ఉపాధి అవకాశాలతోపాటు ఉద్యోగాలు పొందవచ్చని ఓఎన్‌ జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ మేనేజర్‌ అమిత్‌ నారాయణ అన్నా రు.

కంప్యూటర్‌ విద్యతో ఉపాధి అవకాశాలు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 23: విద్యార్థులు కంప్యూటర్‌ విద్యను అభ్యసించడం వల్ల అనేక ఉపాధి అవకాశాలతోపాటు ఉద్యోగాలు పొందవచ్చని ఓఎన్‌ జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ మేనేజర్‌ అమిత్‌ నారాయణ అన్నా రు. స్థానిక ప్రకాష్‌నగర్‌ ధర్మంచర కమ్యూనిటీ హాలులో శనివారం ఓఎన్‌ జీసీ ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సహకారంతో విక్టరీ సోషల్‌ వెల్ఫేర్‌ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అసోసియేషన్‌ చైర్మన్‌ అంబటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నారాయణ, ఊమ్స్‌ అధ్యక్షుడు అనూద నారాయణ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో అంబటి లిల్లీ రోజ్‌, సేవ ఉపాధ్యక్షుడు ఎం.భాస్కరరావు, సీఈసీ సభ్యులు ఎస్‌.రాజ్‌కుమార్‌, సత్తిబాబు, బి.వెంకటేశ్వరరావు, జె.వరప్రసాద్‌, ఎస్‌ఈ రాజీవ్‌కుమార్‌, విక్టరీ సోషల్‌ వెల్ఫెర్‌ సంస్థ కోఆర్డినేటర్‌ కిరణ్‌, విక్టర్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-24T05:35:38+05:30 IST