వైరస్‌ ఉన్నట్లు చూపిస్తోంది... ఎందుకని?

ABN , First Publish Date - 2020-02-08T05:36:12+05:30 IST

అనేక యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లు ఫాల్స్‌ పాజిటివ్స్‌ చూపిస్తుంటాయి. మన కంప్యూటర్లో ఉన్న అన్ని ఫైళ్లకి సంబంధించిన హెడర్‌ని విశ్లేషించడం ద్వారా, ..

వైరస్‌ ఉన్నట్లు చూపిస్తోంది... ఎందుకని?

నా కంప్యూటర్‌లో ఉన్న ఒక జెన్యూన్‌ అప్లికేషన్‌లో వైరస్‌ ఉన్నట్లు చూపిస్తోంది. దీనికి కారణం ఏంటి? 

- రాజేంద్రకుమార్‌

అనేక యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్లు ఫాల్స్‌ పాజిటివ్స్‌ చూపిస్తుంటాయి. మన కంప్యూటర్లో ఉన్న అన్ని ఫైళ్లకి సంబంధించిన హెడర్‌ని విశ్లేషించడం ద్వారా, ఆయా ఫైళ్లు కంప్యూటర్‌లో చేసే పనులను పరిశీలించటం ద్వారా నిజంగానే అవి మాల్‌వేర్‌ ఉన్న ఫైళ్లు కాకపోయినప్పటికీ తప్పుడు ఫలితాలను చూపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్లు చూపించే వైరల్‌ అలర్ట్‌లను ఎల్లప్పుడూ నమ్మాల్సిన అవసరం లేదు.

Updated Date - 2020-02-08T05:36:12+05:30 IST